హైదరాబాద్: -రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలి వెలుతుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సరైన ప్రదేశంగా వైజాగ్‌ను పేర్కొంటున్నారు. అయితే వైజాగ్‌లో పూర్తి సౌకర్యాలు లేక పోవడంతో చాలా మంది హైదరాబాద్ నుండి అక్కడికి పరిశ్రమను తరలించడానికి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అందులో చిరంజీవి పేరు ప్రముఖంగా వినపడుతుండటం గమనార్హం. చిరంజీవి, మరికొందరు కలిసి వైజాగ్ ప్రాంతంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు వైజాగా, భీమిలీ ప్రాంతంలో 450 ఎకరాలు కొనుగోలు చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనక చిరంజీవి ఉన్నారని, ఫిల్మ్ సిటీ నిర్మాణంలో భాగమే ఈ భూముల కొనుగోలు అని అంటున్నారు. మరో వైపు చిరంజీవి 150వ సినిమాపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మణిరత్నం
ఇటీవల మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్ వచ్చారు. ‘సచిన్' అనే ఓ డబ్బింగ్ సినిమా గురించి వీరు హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.....వీరు హైదరాబాద్ రావడం వెనక అసలు ఎజెండా వేరనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో దగ్గరి పరిచయం ఉన్న తన భార్య సుహాసిని తీసుకుని మణిరత్నం వచ్చారని, చిరంజీవితో 150వ సినిమా గురించి చర్చించారని అంటున్నారు.
0 comments:
Post a Comment