హైదరాబాద్ :-రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదిన విడుదల చేయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''ఈ షెడ్యూల్‌లో కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. అనంతరం లండన్‌లో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రకాష్‌రాజ్, జయసుధలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్ శంకర్‌రాజా ఇప్పటికే మూడు పాటల్ని రికార్డ్ చేశారు''అన్నారు. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మార్పు కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు ఈ పాత్రకు గానూ రాజ్ కిరణ్ ని అనుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు కి కారణం చిరంజీవి అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
తన కుమారుడు తాజా చిత్రంపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ మార్పుతో శ్రీకారం చుట్టాడని అంటున్నారు. అంతేకాక కథలో సైతం కొన్ని మార్పులు చేయబోతున్నారని చెప్తున్నారు. గతంలోనూ నాయక్,రచ్చ, ఎవడు చిత్రాల విషయంలో చిరంజీవి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని, అవి విజయం సాధించటంతో ఈ సారి కూడా ఈ సినిమాని పూర్తిగా పర్యవేక్షించనున్నారని సమాచారం. ఈ మేరకు చేసిన సూచనలలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఒకటని చెప్పుకుంటున్నారు. ''సినిమాలో ప్రకాష్‌రాజ్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. తొలుత ఈ పాత్ర కోసం తమిళనటుడు రాజ్‌కిరణ్‌ను ఎంపిక చేశాం. అయితే ఈ పాత్రకు ప్రకాష్‌రాజ్ అయితే బాగుంటారని ఆయన్ని తీసుకున్నాం. రామ్‌చరణ్‌కు అనారోగ్యం వల్ల సినిమాను వాయిదా వేశాం. త్వరలో షెడ్యూల్ ప్రారంభమవుతుంది'' అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్. . ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.
0 comments:
Post a Comment